![]() |
![]() |

'సాహో', 'రాధేశ్యామ్' సినిమాలతో నిరాశపరిచిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నాడు. 'ఆదిపురుష్', 'సలార్', 'ప్రాజెక్ట్ k' ఇలా కళ్ళు చెదిరే లైన్ అప్ తో బాక్సాఫీస్ వార్ కి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ లైన్ అప్ చూసి ఫ్యాన్స్ ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే తాజాగా 'ఆదిపురుష్'కి సంబంధించిన ఒక న్యూస్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆందోళన కలిగిస్తోంది.
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఆదిపురుష్'లో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ కనువిందు చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో సీత తండ్రి జనకమహారాజు పాత్రలో రెబల్ స్టార్ కృష్ణంరాజు కనిపించనున్నారని న్యూస్ వినిపిస్తోంది. ఇదే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతోంది.
ఇప్పటిదాకా తన పెదనాన్న కృష్ణంరాజు నటించిన సినిమాలేవీ ప్రభాస్ కి విజయాన్ని అందించలేదు. 'బిల్లా' యావరేజ్ గా నిలవగా, 'రెబల్', 'రాధేశ్యామ్' డిజాస్టర్స్ గా నిలిచాయి. నిజానికి 'రాధేశ్యామ్'లో కృష్ణంరాజు నటిస్తున్నట్లు తెలిసినప్పుడు కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన చెందారు. అందుకు తగ్గట్లే 'రాధేశ్యామ్' ఘోర పరాజయాన్ని చూసింది. ఇప్పుడు 'ఆదిపురుష్'తో అదే రిజల్ట్ రిపీట్ అవుతుందేమోనని ఫ్యాన్స్ భయపడుతున్నారు. మరి 'ఆదిపురుష్'తోనైనా ఈ నెగటివ్ సెంటిమెంట్ బ్రేక్ అవుతుందేమో చూడాలి.
![]() |
![]() |