![]() |
![]() |

సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి సినిమాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్ లో 28వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రాల్లో మహేష్ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది.
మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన 'అతడు', 'ఖలేజా' సినిమాలకు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న 'SSMB28'పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇదో పీరియాడిక్ డ్రామా అని, ఇందులో మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఫ్లాష్ బ్యాక్ లో ఒక రోల్, ప్రజెంట్ లో మరో రోల్ లో కనిపిస్తాడని టాక్.
చైల్డ్ ఆర్టిస్ట్ గా 'కొడుకు దిద్దిన కాపురం' సినిమాలో మహేష్ డ్యూయల్ రోల్ లో కనిపించాడు. హీరో అయ్యాక 'నాని' మూవీలో క్లైమాక్స్ లో తండ్రిగా, కొడుకుగా కనిపించాడు. ఒకవేళ 'SSMB28'లో నిజంగానే మహేష్ రెండు పాత్రలు పోషిస్తే హీరో అయ్యాక పూర్తి స్థాయిలో ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇదే అవుతుంది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో.. 'బుట్టబొమ్మ' పూజా హెగ్డే కథానాయికగా నటించనుండగా, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బాణీలు అందించనున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్ళనుంది.
![]() |
![]() |