![]() |
![]() |

విక్టరీ వెంకటేశ్ - రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ది `నాన్ - ఫెయిల్యూర్` కాంబినేషన్. `తులసి` (2007), `నమో వెంకటేశ` (2010), `ఎఫ్ 2` (2019), `ఎఫ్ 3` (2022).. ఇలా ఇప్పటివరకు ఈ ఇద్దరి కాంబినేషన్ లో నాలుగు చిత్రాలు వచ్చాయి. వీటిలో ఏ సినిమా కూడా ఫెయిల్యూర్ బాట పట్టలేదు. `తులసి`, `ఎఫ్ 2` బ్లాక్ బస్టర్స్ అనిపించుకోగా.. `నమో వెంకటేశ` ఓకే అనిపించుకుంది. ఇక రీసెంట్ గా రిలీజైన `ఎఫ్ 3` ఆరంభ వసూళ్ళతో ఆశాజనకంగానే సాగుతోంది. కట్ చేస్తే.. త్వరలో వెంకీ - డీఎస్పీ ఇంకోసారి జట్టుకట్టబోతున్నారని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో వెంకటేశ్ కథానాయకుడిగా ఓ సినిమా రాబోతోంది. `జాతిరత్నాలు` ఫేమ్ అనుదీప్ కేవీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు టాక్. కాగా, ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందించబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానున్నది. మరి.. ఫెయిల్యూర్ ఎరుగని కాంబినేషన్ గా గుర్తింపు పొందిన వెంకీ - డీఎస్పీ.. మరో సక్సెస్ ని తమ ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి.
![]() |
![]() |