![]() |
![]() |

దక్షిణాదిలోనూ కథానాయికగా తనదైన ముద్ర వేస్తోంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని. ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబుకి జోడీగా `భరత్ అనే నేను` (2018), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి జంటగా `వినయ విధేయ రామ`(2019) చిత్రాలు చేసింది కియారా. ఇక ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న `#RC 15` (రామ్ చరణ్ - శంకర్ సినిమా)లోనూ తనే మెయిన్ హీరోయిన్. కట్ చేస్తే.. త్వరలో ఈ ముద్దుగుమ్మ మరో దక్షిణాది చిత్రంలో సందడి చేయనుందట. కాకపోతే, ఈ సారి ఓ తమిళ చిత్రంలో ఎంటర్టైన్ చేయనుందట కియారా.
ఆ వివరాల్లోకి వెళితే.. పొలిటికల్ సెటైరికల్ ఫిల్మ్ `మండేలా` (2021)తో తమిళనాట దర్శకుడిగా మంచి గుర్తింపు పొందిన మడోన్నే అశ్విన్.. త్వరలో కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్ తో ఓ సినిమా తీయబోతున్నాడట. ఇందులో కథానాయిక పాత్ర కోసం కియారా అద్వానితో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. కథ, పాత్ర నచ్చడంతో కియారా కూడా నటించేందుకు ఆసక్తి చూపిస్తోందని బజ్. త్వరలోనే కియారా కోలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ రానున్నది. మరి.. శివ కార్తికేయన్ - కియారా అద్వాని జోడీ ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.
![]() |
![]() |