![]() |
![]() |

'ఖైదీ', 'మాస్టర్' మూవీస్‌తో వరుస హిట్లు సాధించి, ఇప్పుడు కమల్ హాసన్‌తో 'విక్రమ్' మూవీని తీస్తోన్న డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్.. ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు మహేశ్‌బాబును కలవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇండస్ట్రీ ఇన్‌సైడర్స్ ప్రకారం ఆ ఇద్దరూ గంటకు పైగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహేశ్‌కు లోకేశ్ ఒక స్టోరీ లైన్ చెప్పాడు. అన్నీ సక్రమంగా జరిగితే సమీప భవిష్యత్తులోనే ఆ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా ఉండే అవకాశం ఉంది.
ఒకటిన్నర దశాబ్దం నుంచీ టాలీవుడ్‌లోని అగ్ర హీరోల్లో ఒకరిగా, నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు కొంగు బంగారంగా మహేశ్ పేరు తెచ్చుకున్నాడు. ఇటు యువ ప్రేక్షకులు, అటు కుటుంబ ప్రేక్షకులు సమానంగా ఆదరించే స్టార్ మహేశ్. 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ సాధించిన మహేశ్ ప్రస్తుతం 'సర్కారువారి పాట' సినిమాతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ రూ. 100 కోట్ల షేర్‌ను క్రాస్ చేయడం విశేషం.
మరోవైపు 'ఖైదీ' మూవీతో డైరెక్టర్‌గా పరిచయమై, అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్న లోకేశ్.. 'మాస్టర్' మూవీతో మరో ఘన విజయాన్ని అందుకున్నాడు. దాంతో ఈ ఇద్దరి కాంబినేషన్ మూవీ కచ్చితంగా క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందని చెప్పవచ్చు.
'సర్కారువారి పాట' తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని, త్రివిక్రమ్ డైరెక్షన్‌లో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు మహేశ్. ఆ మూవీ తర్వాత రాజమౌళితో అతను పనిచేయనున్నాడు. మరోవైపు కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కాంబినేషన్‌లో 'విక్రమ్' అనే క్రేజీ మూవీ తీశాడు లోకేశ్. జూన్ 3న ఆ సినిమా విడుదలవుతోంది.
![]() |
![]() |