![]() |
![]() |

ఈ సెప్టెంబర్ 12న 'మిరాయ్' (Mirai), 'కిష్కింధపురి' (kishkindhapuri) సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. విభిన్న జానర్ లో తెరకెక్కిన ఈ రెండు సినిమాలపైనా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందిన 'మిరాయ్'లో హీరోగా తేజ సజ్జా, విలన్ గా మంచు మనోజ్ నటించారు. ఇక హారర్ థ్రిల్లర్ గా వస్తున్న 'కిష్కింధపురి'లో హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ నటించగా, ప్రచార చిత్రాల్లో డెవిల్ లుక్ లో కనిపించి అనుపమ పరమేశ్వరన్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఇక ఈ మూవీలో మరో సర్ ప్రైజ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక కీలక పాత్రలో మంచు మనోజ్ మెరవనున్నాడని ప్రచారం జరుగుతోంది.
'మిరాయ్', 'కిష్కింధపురి' సినిమాలు ఒకే రోజు విడుదలవుతున్నాయి. పైగా 'మిరాయ్'లో పవర్ ఫుల్ విలన్ రోల్ లో మనోజ్ అలరించనున్నాడు. అలాంటిది ఇప్పుడు అదే రోజు విడుదలవుతున్న 'కిష్కింధపురి'లోనూ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడన్న వార్త ఆసక్తికరంగా మారింది. (Manchu Manoj)
మంచు మనోజ్ తన కమ్ బ్యాక్ ఫిల్మ్ 'భైరవం'లోనూ బెల్లంకొండతో స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. ఇప్పుడు 'కిష్కింధపురి' రూపంలో వీరిద్దరూ కలిసి మరోసారి స్క్రీన్ పై సందడి చేయనున్నారని న్యూస్ వినిపిస్తోంది. మరి ఇందులో వాస్తవమెంతో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.
![]() |
![]() |