మావ...!
posted on Jun 26, 2015
మావ...!
మొన్న పొద్దున్న సంతకెల్లి ...
ఎర్రగాజులు తెచ్చి మావ
మెత్తగ సేతులకేసినాడు ...
మత్తుగ చూసుకుంట...మావ..
నిన్న మద్యాన్నం ...
గండమ్మ దుకాన్ల జూకాలు ,
ముక్కుపుడక కొనిపెట్టి ...
చంద్ర బింబమల్లె ఉన్నవన్నాడు...మావ...
సంజెకాడ... కాలిపట్టీలు పట్టుకొచ్చి ..
పాదాలట్టుకు పలికినాడు మావ ..
మనువాడతాను ఒట్టని...
రేయి గడిచి పాయె...
ఊరు నిదుర లేచె...
నిశిలోన... గుసగుసల ముచ్చట్లు..
మసకబారి ఎదబరువాయె..మావ..
ఏటిలోని పారుతున్న నీటిలాగ ..
నీ మాటలు జారిపోయె..
తడియారుతున్న బట్టలబిగువులు ...
గుబులు నింపి గుండె కోతకోస్తుండే..మావ..
మావా..! ఎన్ని జన్మలెత్తినా ..
ఎదురు చూపుల ...ఈ ఎంకి నీదే...
విరహించినా ..వలపించినా...
నాయుడు బావ ..
ఎప్పటికి ఎంకి కోసమే..
కదా..మావ..!
+++++++++++++++
సుజాత తిమ్మన...