అమ్మ
posted on May 9, 2015
అమ్మ
నీకు తెలుసా?
ఒక వృక్ష మున్నది,
అది కోరినవన్నీ ఇస్తుంది
అదే కల్ప వృక్షము.
నీకుతెల్సా?
ఒక గోవు ఉన్నది,
అది అడిగినవన్నీ ఇస్తుంది,
అదే 'కామధేనువు ',
నీకుతెల్సా?
ఒక రాయి ఉన్నది,
అదీ నీవనుకున్నవన్నీ ఇస్తుంది,
అదే 'చింతామణి '
నీకుతెల్సా?
ఒక ఆయనున్నాడు
ద్వేషం లేకుండా రోషం రాకుండా నిన్నుప్రేమిస్తాడు,
ఆయనే ' దేవుడు '.
ఐతే వీటిని నీవు చూడ లేవు,
కానీ.....
ఈనాలుగూ కలిగిన ఒక ఆమె ఉన్నది,
ఆమే అమ్మ.
- ఆదూరి.శ్రీనివాసరావు