అజ్ఞానం
posted on Feb 10, 2015
అజ్ఞానం
నువ్వు శంఖానివి కనుక
నీలోపోసిన నీరు తీర్ధమౌతోంది
నేను శిలను కనుక, నా క్రిందన
నీరున్నా ఇది వ్యర్థమౌతోంది.
నీలో పోసిన నీటిని దోసిటిలో పట్టి
మరీ త్రాగుతున్నారు
నా క్రిందున్న నీటిలో దోషాలెంచుతున్నారు
మహిమ అనేది మనసులోనే ఉంటుంది కానీ,
మనలో ఉండదని తెలియని అజ్ఞానులు వీళ్ళు
అందుకే నీకు జంకుతున్నారు, నన్ను శంకిస్తున్నారు
పూజ పోజు కాకూడదు, మడి ముడి అవకూడదు
- బి.ఎస్.నాగరాజారావు