మౌనం ఒక ధార

 

మౌనం ఒక ధార



మౌనం ఒక దార గా నాలో
ప్రవహిస్తున్నప్పుడు
మాటల వంతెన కోసం చూస్తుంటాను !!!

ఒక్కో పదం తనని తానూ నిర్మించుకొని
భావ భవనానికి ఇటుక గా మారినపుడు
గాలికి కొట్టుకు వచ్చిన ఇసుక రేణువులా
నా వొడి లో నాద విన్యాసం చేస్తుంటాయి !!!

నాతో నేను యుద్ధం మొదలుపెట్టినపుడు
పోరాడే సైనికుడే, పదునెక్కిన పెదవి అంచున నిలబడతాడు

మాట ని కబళించే మౌనం
నా ఆలోచనల కొసలకు వేలాడుతూ వుంటుంది
పాదరసం లా జారిపోయే అక్షరం లో కి ...!!

- pusyami sagar