ఏమో! - శారదా అశోకవర్ధన్
posted on Jan 16, 2012
ఏమో!
- శారదా అశోకవర్ధన్
మానవుడా! మానవత్వాన్ని గుండెనిండా నింపుకుని
దైవత్వం పొందిన సాధువులా జీవనాన్ని సాగించే
మహామహుడా! జీవనయానంలో అలుపెరుగని ప్రయాణికుడా!
ఎందుకిలా దానవుడిలా మారిపోయావ్?
ఏమైంది నీ సౌందర్యారాధన
కవితలో కథలలో చిరుగాలిలో చిన్న వాన చినుకులో
వెలుగులో, వేడిలో, నీలి మబ్బులో, మెరుపుతీగెలో
పువ్వులో, నవ్వులో, రాతిలో, నీటిలో
అందాలను చేసి ఆరాధించేవాడా
ఎందుకిలా మారిపోయావ్?
చెట్టుకొమ్మలూ చెరువుగట్లూ
ఆకాశంలోని చుక్కలూ ఆత్మను స్పందింపజేసి అలలూ
అన్నీ నీకు పరిశోధనాంశాలే!
ఇంద్రధనస్సూ ఇంద్రియాసక్తీ అన్నీ నీకు
ఆలోచనల రేకెత్తించి పులకరింపజేసే అంశాలే
అవన్నీ ఒదిలి ఎందుకిలా మారిపోయావ్
నేలతల్లి గొంతును రక్తంతో తడుపుతున్నావు
కత్తులతో కుత్తుకలు కోస్తున్నావు
బాంబులతో భస్మం చేస్తున్నావు
తోటిమనిషిని తోడేలువై పీకుతున్నావు
మానవుడా! నువ్వు మారాలి!
స్వార్ధానికి కోరలు పీకి పారెయ్యాలి
మానవత్వానికి మమతల పన్నీరు జల్లి