ముగ్ధ మందారం
posted on Dec 11, 2014
ముగ్ధ మందారం
మధురమైన జ్ఞాపకం నీ పరిచయం,
మధురానుభూతుల నిలయం నీ హృదయం,
మౌనమునిని కూడా కలిచివేయు నీ అందం
మనసులో నీ ప్రతిమ తప్పవేరే రూపమే
కరువైంది ఈ దినం
సాయంకాలం ఉషాకిరణం నీ తనువునే మరపిస్తుంది
ఉదయమంచు తుంపర, నీకోసం తపిస్తుంది
కవుల మదిలో నిల్చిపోయిన ఎర్రమందారమా
నా మనసులో నిండుగా ఉన్న ముగ్ధమందారమా
ప్రియరాగాలు పలికించే వీణామృత తృష్ణ
సరిగమలు ఒలికించే సాగరతీర దృష్ణ
నిత్య వింజామర పవనం నీకోసం తపిస్తుంది
అందుకేనేమో నా ప్రేమ మనసు మందారంలా ఎదురుచూస్తుంది