మనసు భాష

మనసు భాష



మాటంటేనే భయం నాకు!
ఒక తడి కన్నుల చమరింపు
మరిన్ని మనోదృశ్యాల మొహరింపులో
నిశబ్దం...  నిజదర్శన మహోన్నత భాష!
ఆలోచనారణ్యంలోంచి...
ఎప్పుడో ఓ కొమ్మ విరిగి  పడినప్పుడు
సంఘర్షణల శబ్దచాలనంలోంచి
ఆస్తిత్వాహంకారాల వేదికపై
పువ్వులా విరబూసే సత్యాన్ని వినగలవా!
నిశబ్దం అంటే....
బహిరింద్రియాల అదిరిపాటు నణచి
మనసు తలుపులు బార్లా తెరిచి
ప్రకృతి భాషను వినగాల్గటమే!
నాలుక కత్తితో నిలువెల్లా చీలుస్తూ
ప్రేమరాహిత్యంతో
పలుమార్లు మాటంటేనే భయం నాకు
ఎందుకంటే
అది మనసు భాష కాదుకదా!!!