నడకల నాణ్యత

నడకల నాణ్యత

- స్వప్న కంఠంనేని

ఇక మనుషుల నడకల విషయానికి వద్దాము.
ఒక మనిషి నడిచే తీరు ఆ వ్యక్తి దృక్పధాన్ని, అంతకు మునుపు జీవితంలో అతను చవిచూసిన వొడిదుడుకుల్ని తెలియచేస్తూ అతడి క్యారెక్టర్ నీ వెలి జూపుతుంది.
ఒక అమ్మాయి తను ప్రేమించే లేక ప్రెమించాలనుకుంటున్న యువకుడితో షికారుకు వెళ్ళిందనుకుందాము. ఆ సమయంలో అతడు నడిచే పద్ధతిని బట్టి ఆమె అతడి మనస్తత్వాన్ని తెలుసుకుని తనాతనితో మరింత ముందుకు వేళ్ళలో వద్దో నన్న విషయంలో ఒక నిర్ణయానికి రావచ్చు.
ఆమె కంటే నిదానంగా నడిస్తే ఒక యువకుడు తను ప్రేమించే అమ్మాయి కంటే గబగబా ముందుగాని ఆమెకంటే నెమ్మదిగా గాని నడుస్తున్నడనుకోండి.
అతడు ఆమె అవసరాల్ని పట్టించుకోని వాడని అర్ధం చేసుకోవచ్చు. అంతేకాదు, ఆమె మీద తన ఆధిక్యాన్ని, కంట్రోల్ నీ ప్రదర్శించ జుస్తున్నాడని అనుకోవచ్చు.
ఇంకా అతనితో పెళ్ళికాక, సంబంధమేమీ శృతి మించకపోతే ఆ అమ్మాయి అతనితో ' నాయనా నీకో నమస్కారం! అని చెప్పేయటం ఉత్తమం.
గుళ్ళు బిగబట్టి నడిస్తే
తల వేలాడేసి గూళ్లు బిగబట్టి ఎంతో బరువును మోస్తున్నట్లు నడిచే యువకుడు జీవితంలో నిరాశా నిస్పృహలను చవిచూసిన వాడని ఆర్ధం చేసుకోవాలి.
జీవితం పట్ల అతనికుండే నెగటివ్ దృక్పధం అతడిలో జీవితం పంచుకోవాలనుకునే స్త్రీనీ చికాకు పరిచే అవకాశం ఉంది. అయితే ఆమె కూడా అతనిలాగే బరువు బాధ్యతల్ని మోస్తున్న స్త్రీ అయితే అతనామెకు సరి జోడి! టెంపరమెంట్ తో, తలతిక్కగా ప్రవర్తించే యువకుల కంటే ఇతను ఉత్తమం! తాను ప్రేమించే స్త్రీలోని సహనసౌశిల్యాలను ప్రశంసిస్తాడితను. ఆమె మీద ఆధారపడి ఉండటానికి ఇష్టపడతాడు.
జేబుల్లో చేతులు పెట్టుకొని
కొందరు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుస్తుంటారు. ఇది ఒకప్పుడు స్టైల్ గా కనిపించినా వాస్తవానికి ఇలా జేబుల్లో చేతులు పెట్టుకుని నడవటం తన అతిముఖ్యమైన జననేoద్రియ భాగాల్ని కాపాడుకోవటానికి చేసే ప్రయత్నం. తన భావాల్ని తనలోనే దాచుకునే మనిషి అయి ఉంటాడితడు. ఇతరుల మనస్సుల్ని స్పృశించటానికి  వాళ్ళ భావాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడితను.
ఇతడితో జీవితాన్ని పంచుకోవాలనుకునే స్త్రీ ముందుగా తన గురించి అతనికి నమ్మకం కలిగించటానికి  చాలా పాట్లు పడాల్సి ఉంటుంది.
పిడికిళ్లు బిగించి
నలుగురిలో నిలబడి ఉన్నప్పుడు గాని నడుస్తున్నప్పుడు గాని కొందరి పిడికిళ్లు గట్టిగ బిగుసుకుని ఉంటాయి. ఇలాంటి మనిషి నెర్వస్ మనిషి అని లోకం మీద ఎంతో కక్ష ఉన్నవాడని అర్ధం చేసుకోవాలి. ఇతడు తనలోని నిరాశా నిస్పృహల్న, తన బరువు బాధ్యతల్ని తనతో జీవితం పంచుకొనే స్త్రీ మీద మోపే ప్రమాదం ఉంది. కాబట్టి అమ్మాయిలు ఒకటికి రెండు సార్లు ఇతని గురించి పునరాలోచించటం మంచిది!