వస్త్రధారణ ఏం చెబుతుంది ?
posted on Jan 7, 2014
వస్త్రధారణ ఏం చెబుతుంది ?
పార్ట్ -2
ఎన్ని జతల పాద రక్షలున్నాయి ?
- స్వప్న కంఠంనేని
ఒక మనిషి Maintain చేసే పాదరక్షల్ని బట్టి అతని బుద్ది ఏపాటిదో గ్రహించవచ్చు:
ఒక వ్యక్తీ అనేక జతల పాదరక్షల్ని ఉంచుకుని ఇవాలోకటి, రేపు మరొకటి ధరిస్తుండవచ్చు. అలాగే మరో వ్యక్తీ ఒక్క జతను మాత్రమే ఉంచుకుని అవి పాడైపోయేదాక రోజు వాటినే వాడుతుండవచ్చు అలాంటపుడు
* అనేక పాదరక్షలు కలిగి ఉంది రోజుకో పడరక్షను విలాసవంతంగా ధరించే వ్యక్తీ అభిరుచుల్ని సంతృప్తిపరచడం గానీ, అతణ్ణి పట్టుకోవడం గానీ, అతడితో జీవించే లేక జీవించాలనుకునే స్త్రీకి కొంచం కష్టసాధ్యమే అవుతుంది.
* చంచల మనస్కుడతను. పూర్వజన్మలో ఏ నవాబుగారబ్బాయినో అన్నట్లు అతను దారేపోయే సీతాకోకచిలుకల వేపు దృష్టి సారించే అవకాసం వుండదు.
* చిరిగిపోయేదాకా ఎప్పుడు ఒకే పాదరక్షల్ని వాడే వ్యక్తీ డబ్బుల విషయంలోనూప్రేమ విషయంలోనూ పరిమిత ఖర్చును ప్రదర్శిస్తుంటాడు. జీవితలో ఒకే ఒక్క స్త్రీకి కట్టుబడి ఉంది ఆ సంబంధాన్ని నిజాయితీగా అంటిపెట్టుకుని ఉంటాడు.
* ఇక్కడ అమ్మాయిలు ఒక విషయాన్నీ గమనించాలి. పురుషులకూ సంబంధించిఈ చెప్పే ఏ ఒక్క విషయాన్నీ ప్రామాణికంగా తీసుకుని గభాల్న ఒక అంచనాకి రాకూడదు
దుస్తులు ధరించే ధోరణి పక్కన పెడితే :
ఒక వ్యక్తీ ధరించే వర్ణాలు అతడిలో టెంపర్మెంట్ ని, మూడ్ ని బయట పెడుతుంటాయి. ఇప్పుడు ఆ వర్ణాలు చెప్పే వివరాలేమిటో చూద్దాం...
తెలుపు :
తెలుపు వర్ణాన్ని మనవాళ్ళు స్వచ్చతకు సూచనగా చెబుతారు .తరచుగా తెల్లటి దుస్తుల్ని ధరించే వ్యక్తీ సంప్రదాయక భావాలు కలిగినవాడై ఉంటాడు స్త్రీతో కూడా అతను సంప్రదాయకంగా ఆమెకు కట్టుబడి ఉంటాడు.
అయితే కొన్ని సందర్భాలలో స్త్రీకి అతను కొంత మొండిగా,గిజినపట్టు మనిషిగా కూడా కనిపించవచ్చు కాని ఆమెపట్ల అతను నిజయితగా ఉంటాడనేందుకైనా ఆమె సంతోసించవచ్చు
నలుపు :
అధికంగా నల్ల దుస్తులలో కనిపించే వ్యక్తీ మూడీ మనిషి కావచ్చు ఆ మూడ్స్ కూడా నెగిటివ్ ధోరణిలో ఉంది అతనితో జీవించే స్త్రీకి తరచుగా చికాకును కలిగించుతాయి.
ఎరుపు:
సజీవత్వానికి చిహ్నం ఈ రంగు! ఈ రంగు దుస్తుల్ని ధరించే మనిషి మిడిసిపడుతూ అగ్రెసివ్ గా ఉత్తేజంగా ఉంటాడు. హమేషా అతను తన జీవితాన్ని ప్రేరణ కలిగించే స్థితిగతుల కోసం అన్వేషిస్తూ తన స్త్రీ పట్ల సమ్మోహిత పూరితంగా ప్రవర్తిస్తాడు. ఆమె కూడా అతని పట్ల సమ్మోహితంగా ఉండగలిగితే ఒకరికోకళ్ళు సరిజోడు అవుతారు.
నీలం :
స్వతహా నెమ్మదస్తుడు, ప్రశాంత చిత్తుడు ఈ వర్ణాన్ని అభిమానిస్తాడు. ఈ రకం దుస్తుల్ని ధరించుతాడు. అతడి ప్రశాంత నైజం అతడిలో జీవితాన్ని పంచుకునే స్త్రీకి ఒక వరం లాంటిది ఆమె జీవితం ఒడిదుడుకులు లేకుండా ప్రశాంత గోదావరిలా సాగిపోతుంది.
ఆకుపచ్చ :
ప్రకృతి వర్ణం! నూతనత్వానికి చిహ్నం !! సాహసాల పట్ల అవుట్డోర్ రోమాన్స్ పట్ల ఆసక్తి కలిగి ఉండే స్త్రీకి ఈ దుస్తుల్ని ధరించే పురుషుడు ఆదర్శ జోడి !
పసుపు వర్ణం :
ఈ దుస్తుల్ని ధరించే వ్యక్తీ కల్మషరహితుడు, మానవత్వం పట్ల గౌరవం కలిగిన వాడూ అయి వుంటాడు. తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలనే తాపత్రయం కలవాడై ఉంటాడు అతడితో జీవితాన్ని పంచుకునే స్త్రీ అతడిని పూర్తిగా నమ్మవచ్చు.
ఇక్కడొక విషయం -
ఈ మనిషి ఎప్పుడు ఒకే రంగు దుస్తుల్ని ధరించాడు ! వెరైటి కోసమైనా గాని రకరకాల వర్ణాలలో దుస్తుల్ని వేసుకుంటాడు అయితే మరి అతని దుస్తులలో ఏ వర్ణాన్ని లెక్కలోనికి తీసుకోవాలి ?
అతను ధరించే దుస్తులలో ఏ రంగు ఎక్కువ డామినేట్ చేస్తుందో పరీశీలించాలి. ఆ రంగును బట్టి అతని అభిరుచి ఏమిటో, ఆ అభిరుచి వెనుక ఉండే అతని మనస్తత్వం ఏమిటో, అతను తనకు ఈ రకంగా సరిపోతాడో సరిపోల్చుకోవాలి...