ప్రేమలో పడే అమ్మాయిలకు కొన్ని జాగ్రత్తలు
posted on Oct 23, 2013
ప్రేమలో పడే అమ్మాయిలకు కొన్ని జాగ్రత్తలు
- స్వప్న కంఠంనేని
ఒక యువకుడు తటస్థించి క్రమంగా తనాతని వైపు ఆకర్షించబడుతున్నప్పుడు ప్రతి యువతీ విధిగా ఈ క్రింది అయిదు ప్రశ్నలనూ వేసుకుని తననితాను శోధించుకోవాల్సిన అవసరం వుంది.
* అతను తొలి చూపులోనే ఆకట్టుకుంటున్నాడ అయితే అదంతా నిజమేనా అందులో నాటకమేమి లేదు కదా !?
. ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా ప్రేమ తొలి దశలో ఉన్నపుడు ఏ మనిషైన అవతలి మనిషిని ఆకట్టుకోవడానికి సర్వశోభాయమనుడిగా కనిపించటానికి ప్రయత్నిస్తాడు. తనలోని లోపాలను కప్పెట్టి ఉంచడానికి ప్రయత్నిస్తాడు.
. ప్రతీదానికి తల వూపుతున్నట్లు కనిపిచేవాడు వాస్తవంలో మిమ్మల్ని నమ్మించడానికి మాత్రమే అలా నటిస్తుండవచ్చు.
. ఉదాహరణకు అతడు బేరార్ కి టిప్పు ఎలా ఇస్తున్నాడు.కరచాలనం ఎలా చేస్తున్నాడు, వీధిని ఎలా దాటుతున్నాడు. లాంటి వాటిని అబ్జర్వ్ చేయద ద్వారా అతడిలోని కొంగ జపాన్ని అర్ధం చేసుకోవచ్చు.
* నిజంగా అతడు మీతో బంధాన్ని కోరుకుంటున్నాడా ?
. కొందరు పురుషులు ఆడవాళ్ళతో తాత్కాలిక సంబంధాలకే ఇచ్చగిస్తారు.గానీ శాశ్వత అనుబందం ఏర్పరచుకోవాల్సి వచ్చేసరికి ఉలిక్కిపడతారు. అందుకే ప్రేమ ప్రారంభ దశలో "నువ్వు లేకుండా నేను బ్రతకలేను" ప్రియురాలికి తన మూలంగా గర్భం వచ్చిందని తెలియగానే మొహం చాటేస్తాడు.
. క్రమంగా ఆమెను కలుసుకోవటం తగ్గించటం, లేనిపోని గొడవలు పెట్టుకోవడం. ఆమెనుంచి అర్ధంపర్ధం లేని డిమాండ్లు చేయడం మొదలెడతాడు దీనికి అర్ధం ఇక ఆమెతో తెగతెంపులు చేసుకోవడానికే.
* అతడు మీతో శాశ్వత సంబంధాన్ని కోరుకుంటున్నాడో తాత్కాలిక కోర్కెల్ని తీర్చుకోవడానికే చూస్తున్నాడో తెల్సుకోవడం ఎలా ?
. అతడి పూర్వపు సంబందలేమిటి, అతని ఉద్యోగ చరిత్ర ఏమిటి,అతని గది అలంకరణ ఎలా ఉంది. లాంటి వాటిని పరిశీలించడం ద్వారా తెలుసుకోవచ్చు.
* ఎమోషనల్ గా అతను మీకు చేయూతనిస్తాడా లేదా ?
. నిజమైన ప్రేమలో ఉన్న పురుషుడెప్పుడు తన స్త్రీ విజయాన్ని కాంక్షిస్తాడు. ఎమోషనల్ గా ఆమెకు చేయుతనందివడానికి ప్రయత్నిస్తాడు.
. ప్రియురాలి ఆశయాలు ,లక్ష్యాలు కూడా తన ఆశయాలు ,లక్ష్యాలంత ప్రాముఖ్యత గలవనీ తమ మధ్య ఎమోషనల్ గా ఆరోగ్యవంతమైన సంబందాలుండాలనీ భావిస్తాడు.
* అతడు ఎమోషనల్ గా చేయూతనిచ్చే మనిషి అవునో కాదో తెలుసుకోవడం ఎట్లా ?
. సాయంత్రం మీరేదన్నా ప్రోగ్రాం పెట్టుకున్నపుడు దానిని నిర్ణయించే విషయంలో మీ అభిప్రాయానికి విలువ ఇస్తాడో లేదో, లేక మీరేదన్నా విషయమై సలహా అడిగినపుడు అతను ఎలా స్పందిస్తాడో మొదలైన వతి ద్వారా తెలుసుకోవచ్చు.
* స్త్రీలో అతను ఏమి కోరుకుంటున్నాడు.
. తిరస్కరించబడతామేమోనన్నభయంలో పురుషులు ప్రేమ ప్రారంభ దశలో తమ అసలు అభిప్రాయాన్ని కాక ప్రియురాలికి ఇష్టమైన అభిప్రాయాలనీ వ్యక్తం చేయటానికి ప్రయత్నిస్తారు.
. ప్రియురాలితో తాను స్వతంత్ర అభిప్రాయాలూ గల ఆధునిక యువతిని ఇష్టపడతానని చెప్పవచ్చు కానీ లోలోపల సంప్రదాయబద్దమైన యువతిని కోరుకోవచ్చు.
* మొత్తం మీద అతను మిమ్మల్ని నిరాశపరచడు కదా ?
ఏ స్త్రీ అయినా తన ప్రేమ విజయవంతమై అంతిమాన ప్రియుడు తనను వివాహమాడాలని కోరుకుంటుంది. ప్రేమ వివాహానికి దారితీయకపోవదానికంటే దారుణమైన నిరాశ స్త్రీ కో మరొకటి వుండదు.
సో...
ప్రేమలో పడబోయే అమ్మాయిలు, హృదయాన్నే పారేసుకో బోయే యువతులు తమ జాగ్రత్తలో తాముండటం కోసం - తాము కోరుకుంటున్న పురుషుడు గోవా,సాధువా,గొంటనక్కో, గర్జించే పులో తెలుసుకోవడానికి పనికి వచ్చె ఈ అంశాలు మీ మా పాఠకుల కోసం...