కనులు వేయిగా జేసి

కనులు వేయిగా జేసి
లక్షలను వెదజల్లి
లక్ష్యమును సాధించ
లేకపోతినె నేను

కుక్షి కడ ప్రాణమున
కేల రెక్కలు వచ్చె
నను వీడిపోకుమని
కరములా వేడితివే

ఉచ్చ్వాస నిశ్వాసలే
నిలిచి పోయెనే
విను వీధికేగితివే
నా... జాబిలమ్మ

వి.బ్రహ్మనందచారి