నేనెవరు - సులోచనాదేవి
posted on Jan 11, 2012
నేనెవరు?
- సులోచనాదేవి
ఎక్కడో ఊరవతల
ఎవ్వరూ లేనిచోట
ఓ చిన్న కొండ
అక్కడ నేనుంటాను
నీకోసం ఎదురు చూస్తూ
నువ్వు రోజూ వ్యాహాళికి
అక్కడికి వస్తావు
నేనంటే నీకు చాలా ప్రేమ
ఒక్క రోజు నువ్వు రాకపోతే
నాకు పిచ్చెక్కినట్టుంటుంది
మరుసటి రోజు నువ్వు వస్తావు
నువ్వుకూడా నావైపు చాలా
అప్యాయంగా అప్పుడే చూస్తున్నట్టు చూస్తావు
చల్లని చిరుగాలిలో హాయిగా
నా నీడన నిదురిస్తావు
నిన్నలాగే ఒడిలో చేర్చుకోవాలనుంటుంది
కాని అలా చేయలేను
నేను నీలాంటి మనిషిని కాదుకదా
నేను నీకు నీడనిచ్చే చెట్టుని మాత్రమే