posted on Aug 10, 2013
ఎన్నెన్ని తలపులో
వి. బ్రహ్మనందచారి
ఎన్నెన్ని తలపుల
ఎన్నెన్ని ఊసులో
ఈ చిన్ని గుండెలో
ఎన్నెన్ని ఆశలో
అన్ని నీవనుకొని
కన్యకామణి నిన్ను
కళ్యాణమాడితిని
కలలు ఫలియించెనని
మూన్నాళ్ళ ముచ్చటగ
మురిపించి పోయితివె
నట్టేట ముంచితివె
నా....జాబిలమ్మ