posted on Aug 3, 2013
ఇంపారగను గట్టి
వి. బ్రహ్మనందచారి
ఇంతలింతల చీర
ఇంపారగను గట్టి
ఇచ్చకములాడి నువు
ఇప్పుడె మరలోస్తానని
కనరాని లోకమ్ము
లనుచేరుకొంటివా
కలికమునకైన నొక
నలుసంత చాలునే
లిప్తమున సగమైన
తృప్తి తీరగ వచ్చి
మరలపోదువు రావె
నా....జాబిలమ్మ