అందాల హరివిల్లు

అందాల హరివిల్లు

వి.బ్రహ్మనంద చారి

అందాల హరివిల్లు
కురిసేటి విరిజల్లు
బంగారు మోములో
ముత్యాల చిరునగవు

సింగారమొలికించు
చెంగావి చీరలో
తొంగి చూసేనులే
అంగవైభమెల్ల

ఖంగారు పడనేల
పొంగారు యవ్వనము
పొదివి పట్టిన రైక
నా.... జాబిలమ్మ