posted on Jul 17, 2013
బ్రహ్మనై మనసంత
వి.బ్రహ్మనంద చారి
బ్రహ్మనై మనసంత
నీ తలపె నింపుకొని
కవనముల్ రచియింప
మొదలు పెట్టినయంత
శాంత శారదవై ప్ర
శాంత వదనము తోటి
మది వీణ శ్రుతి చేసి
వినిపించు నీ వాణి
మృదు మధుర భాషిణీ !
మంద గమనముతోడ
నడచివచ్చిన చాలె
నా......జాబిలమ్మ