క్షణక్షణం నీవుగా - దాసరి సులోచన దేవి

క్షణక్షణం నీవుగా -

 

దాసరి సులోచన దేవి

 

చెలిమి కలిమి కలయికతో

వలపు వలువల వన్నెల్లో

తీయని తలపుల చిరుచిరుమల్లెల సౌరభంలో

రాగరంజిత పూలబాల అధారసుధారవంలో

 

యుగమే క్షణంగా పదమే పల్లవిగా

కాలానికి ఆవలగా జీవితాన్ని శృతిచేసి

మహతి మాణిక్యాల నవనతం చేసి

బ్రతుకు రాగం ఆలపించి

 

వెన్నెల రాత్రులుగా వసంత ధాతృలుగా

అణువణువు క్షణక్షణం నీవుగా

'నీవులో' నేనుగా 'నా' లో నీవుగా

వుండిపోదాం నిండిపోదాం

 

ఇది నా ఆకాంక్ష

ఇది నా ఆశ.