కాలాగ్ని- ఎన్. హరిప్రియ
posted on Jan 11, 2012
కాలాగ్ని
ఎన్. హరిప్రియ
ప్రియ!
బిగియార కౌగిలించిన ఈ
బిగి కౌగిలి నుంచి నను వదలకు
అంటే....
నీ మీద నాకు నమ్మకం లేక కాదు.
ఏ కాల కెరటమో పైశాచికంగా విజృంభించి
కరాళ నృత్యం చేస్తూ వచ్చి....
నా కన్నుల్లో, నా చూపుల్లో, నా తలపుల్లో,
నా ఊహల్లో, నా గుండెల్లో, నా స్మృతిలో....
నా అణువు అణువులోనూ.....ఇంకా....
నాలోనే నిన్ను నింపుకున్న నన్ను చూసి ఓర్వలేక
నీ ఏమరుపాటు చూసి....
మనను విడదీస్తే....
నేను మనగలనా?......
అలా జరిగిన నాడు నా జీవిత పుటలు
కర్కశ కాలాగ్నిలో రగిలి దగ్ధమైనట్లే
అది మాత్రం గుర్తుంచుకో