హైబర్నేషన్ (కవిత)

హైబర్నేషన్

 

కళ్ళు తెరిచి కకూన్లలో పొదువుకుంటూ
ఇంకా ఎగరలేమేమని దిగులా
మనం పట్టిన కుందేలుకు
కాళ్ళెపుడూ మూడే కదూ కూపస్థ మండుకా!

రక్షణో శిక్షో తెలియదు కానీ
ఇపుడిది చేయాలి ఇది చేయకూడదంతే..
రూలేమిటో తెలియని రూత్లెస్ గొర్రెలం
రామా కనవేమిరా!

కమనీయ ముసుగుల మాటున
కర్కషపు పాదాల తొక్కుళ్లలో
కలలెన్ని నలిగాయో కనికరములేదే
డీమస్క్ పెర్ఫ్యూమ్లు నాభిన దాచుకొని
పరిమళించలేని డిటాచ్డ్ జిందగీలో
మెర్సీలెస్ మయసభలు
కళ్ళు తెరువు గాంధారి..ఇంకొంత నవ్వేవూ!

- Saritha Bhupathi