నేను నా పిచ్చి
posted on Jan 24, 2017
నేను నా పిచ్చి
నేను నా పిచ్చి.. ప్రపంచం
నే చూడ గలనో లేనో
లంచమెరుగని భారతాన్ని
స్వలాభం ఎరుగని అధికారులని
స్వార్ధ చింతన లేని నాయకుడ్ని
నే చూడ గలనో లేనో
మతమెరుగని దెశాన్ని
ఉగ్రవాద చర్యలు లేని నేలను
ఆకలి చావెరుగని మానవ జాతిని
నే చూడ గలనో లేనో
బూతులు లేని పాటలని
కేకలు లేని అర్థవంతమైన చిత్రాలను
నిండుగ కనువిందు చేయు నాయికలను
నే చూడ గలనో లేనో
పెడ దారి పట్టని యువత ను
ప్రాణాలు తీయని ప్రేమను
నీతిని నేర్పే విధ్యను
నే చూడ గలనో లేనో
సహనం.. యెక్కువ... మన జనానికి
-Tumuluri Sarma