గువ్వకు జరమమ్మా (కవిత)
posted on Apr 5, 2016
గువ్వకు జరమమ్మా
గువ్వకు జరమమ్మా, రాతిరి బువ్వే తినలేదు
ముక్కుకు ముక్కెర కావాలన్నది
ముక్కు తిప్పుతూ నడవాలన్నది
గువ్వకు జరమమ్మా, రాతిరి బువ్వేతినలేదు
గువ్వకు జరమమ్మా, రాతిరి బువ్వే తినలేదు
చేతికి గాజులు కావాలన్నది
చెయ్యి తిప్పుతూ నడవాలన్నది
చేతికి గాజులు కావాలన్నది
చెయ్యి తిప్పుతూ నడవాలన్నది
గువ్వకు జరమమ్మా, రాతిరి బువ్వే తినలేదు
గువ్వకు జరమమ్మా, రాతిరి బువ్వే తినలేదు
నడుముకు డాబులు కావాలన్నది
నడుము తిప్పుతూ నడవాలన్నది
నడుముకు డాబులు కావాలన్నది
నడుము తిప్పుతూ నడవాలన్నది
గువ్వకు జరమమ్మా, రాతిరి బువ్వే తినలేదు
గువ్వకు జరమమ్మా, రాతిరి బువ్వే తినలేదు
కాళకు గజ్జెలు కావాలన్నది
కాళ్లు తిప్పుతూ నడవాలన్నది
కాళ్లకు గజ్జెలు కావాలన్నది
కాళ్లు తిప్పుతూ నడవాలన్నది
గువ్వకు జరమమ్మా, రాతిరి బువ్వే తినలేదు
గువ్వకు జరమమ్మా, రాతిరి బువ్వే తినలేదు
Courtesy..
kottapalli.in