ఎన్నో వసంతాల తరువాత (కవిత)


ఎన్నో వసంతాల తరువాత

 

 

ఎన్నో వసంతాల తరువాత....
మనసులోని బావాలు అలలు గా ఎగిసి పడుతుంటే...
గండి తెగిన గుండెలోని వేదనలు కంటి పాపను తడుపుతుంటే...
నిస్సత్తువతో కొవ్వొత్తిలా కరిగిపోతున్న ఆనందపు వెలుగు మారుతుంటే...
చేతిలోని కలం....మనసులోని బావం...ఉరకలు వేస్తానంటుంటే.....
ఆగ లేక...ఆప లేక...ఈ ప్రేమ లేఖ మొదలు పెట్టాను.......

తొలి పలుకులు...తొలకరి జల్లుల ఇసుకతిన్నేలో నీ అడుగులలో నా అడుగులు..
అడుగడుగునా... హ్రుదినిండా ఆ మధురమైన జ్ఞాపకాలు......

నీవే నా నెల రాజువని...నను వీడని నా నీడవని...
అనుక్షణం వీడని నా తలపుల మది ఆలోచనల చిరు సవ్వడివని....

క్షణమైనా వీడని నా తలపుల జాడవు నీవు....
నీ మనోహర రూపం కోసం ఎదురు చూసే నా కంటి పాపల ఆశవు నీవు...

ఆనాటి నీ ప్రేమ లేఖలు...ఈ నాటికి అవి మధురమైన స్మృతులు...
నీవే తెలిపే ఆ ప్రేమ ఊసులు...మనసుని తట్టి లేపే అనుబూతులు...

రావేమి, రా ఏమి? రమణీయమైన ఆ మధుర క్షణాలు...
మనసు మాటలు...కనుల ఊసులు...కన్న కలలు...

ప్రణయ ప్రకృతితో ...నీలి మేఘాలతో...హోయలోకించే జలపాతాలతో..గుడి గంటలతో...జడి వానతో నీవు చెప్పిన నీ ప్రేయసి కావ్యం...ఇప్పటికి నా మది పులకించే శ్రావ్యం...

ఎప్పటికప్పుడు...నీ ఎద చప్పుడు తెలిపే ఆ లేఖ....ఇపుడు లేక ఆగ లేక
మనసులోనే దాచేస్తున్నాను ఈ ప్రేమ లేఖ నీకు పంప లేక...

...Sudharani Challa