నెహ్రు గారి వీలునామా
posted on Nov 13, 2015
నెహ్రు గారి వీలునామా
(చాచా నెహ్రు జన్మ దిన సందర్భంగా)
(నెహ్రు తానూ చని పోతూ గూడా తాను వ్రాసిన విల్లులో తన దేశ భక్తిని చాటు కోవటం ఎంత విశేషం )
అహో ! మిత్రులారా !
నా భరత పుత్రులారా !
ఎన్నలేను మీ దేశ సేవలను
ఎంతని కొనియాడుడును ?
మీ దేశ భక్తి మీఈ అనురక్తి
మేలిమియైనది అమూల్యమైనది
ఎంత ఘనమైనదో వివరింపగ
విరించి తరమా ? నేనెంత వాడను !....అహో..
రే బవలును నా వెనుక నిలిచితిరే !
కలతల బడ నా మనసు నెరిగితిరే
ఆపదలందున ఆదుకొంటిరే!
మీ బాసటదే నా కూపిరులై
జీవించితినీ సేవించితిని
మీ రందిచిన ప్రేమామృతమును
పరవశించి నే త్రాగితిని
ఎంత ఘనమైనదో వివరింపగ
నా తరమా ? నా మది కనుభవము!..అహో..
బ్రతుకుండు వరకు భరతమాతకే
అంకిత మౌననె నా బ్రతుకు
నే బ్రతికినను మీ సేవలకే
నే చితికినను మీకొరకే నోయి !
బ్రతుకు బండలై పోయిననాడు
చితినే చేర్చగ రారండోయి!
చితి ఆరిన మరునాటి కర్మలే
చేయవలదోయి ! క్షమింపుడోయి !
చితి మిగిలిన నా చితా భస్మమును
ఒక పిడికెడు గంగను కలపండోయి!
గంగానది అది పుణ్య మహానది
రంగైనది భారత జీవనది
నాటినుండి నేటి వరకు నున్నది!
కాలమంత ప్రవాహించుచుండు నది
కాల గమనమూ యీ కలి గమనము
ఆపలేనిది పుణ్య ప్రవాహము !...అహో..
ఇకను మిగిలిన చితాభస్మమును
నింగి నుండి వేద జల్లండోయి!
రైతులు హలాల పొలాల దున్నగ
బ్రతుకు పంటలెటపండేనోయి !
భూమాత యొడిని యొదుగు ధూళిగా
భారతమ్మ నొడి నొదిగి పోదునోయి!
బ్రతుకు పంట పండించిన మన్నిది
భారత భూమిని నిదుర పోదునోయి!
కలిసి పోదునోయి !...అహో...
నెహ్రు గారి విల్లు ఆధారంగా వ్రాసినది .
రచన: నల్లన్ చక్రవర్తుల వేంకటరంగనాథ్ .