'ఆమె' - బొమ్మారెడ్డి వెంకట రామిరెడ్డి
posted on Jan 19, 2012
'ఆమె'
- బొమ్మారెడ్డి వెంకట రామిరెడ్డి
ఆమె ఆత్మీయత ముందు
అవనతవదనుణ్ణవుతాను
భూమాతయందు మట్టి మనిషిలా!
దేవత సన్నిధిలో భక్తుడిలా!!
నీ ముందు మోకరిల్లని పురుషుణ్ణి
క్షమించకు
నీముందు తలవొంచని వ్యక్తిత్వాన్ని
సహించకు
ప్రేమ సామ్రాజ్యాన్నేలాలంటే...
తలలు నరుకుతూ పోవడానికి సందేహించకు.
బంధాల పేరుతో మగజులుం
బాహాటంగా చెల్లుతోంది కదా!
ప్రేమతో తలలు తుంచడం
పాపమేమీ కాదు కదా!
ప్రేమను నమ్మిన వారికి
ప్రియులకేం కొదవ?
దుఃఖం దక్కిన వారికి
కన్నీటికి కరవా??
నాప్రేమ భిక్ష నాకు పారెయ్యి
పారిపోతాను దూరంగా
కలల అలల తేలివొచ్చి
కరిగిపోయే స్మృతిలాగా!
నీ నుంచి నేర్చుకున్నాను
ప్రేమించడం
నేర్చుకోలేకపోయాను క్షమించు...
ద్వేషించడం
సశేషం