దృష్టి (కవిత)
posted on Oct 15, 2015
దృష్టి
ఎంతో ఎంతో ఎత్తుకి ఎక్కాను
ఓ ప్రభూ శిఖరం ఎక్కడ?
ఇంకా ఇంకా లోతుకి తవ్వాను
ఓ ప్రభూ జ్ఞాననిధి ఎక్కడ ?
దూర దూర తీరాలు పడవలో వెళ్ళాను
ఓ ప్రభూ శాంతి ద్వీపం ఎక్కడ?
ఓ సర్వశక్తిసంపన్నా, నా దేశాన్ని దీవించు
దూరదృష్టి, స్వేదం ఆనందం పండించాలని.
ఏ పీ జే అబ్దుల్ కలాం
ఏ పీ జే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా
అనువాదం శారద శివపురం
--Sivapurapu Sharada