స్నేహం కడలి అంత బాధనైనా కనుమరుగు చేస్తుంది ఎక్కడో వుందనే అమృతాన్ని మన ముంగిటికి తెస్తుంది అంతమే లేని ఆదికావ్యమది అదే స్నేహం..
అతిథి అనుకున్న అతిథి వస్తే ఆనందం అనుకోని అతిథి వెళ్ళకుంటే ఆక్రోశం
మనసుల కడవల్లో వాగ్దానపు రాళ్లు వేసి ఓట్ల నీళ్ళు తాగేసి ఎదిగి ఎగిరి పోయేది
నెల మొదట్లో కుబేరుడు నెల చివర్లో కుచేలుడు
తప్పు నాదే నిన్ను ప్రేమించడం తప్పు నాదే నేను నువ్వు అవడం తప్పు నాదే నన్ను నేను మర్చిపోవడం తప్పు నాదే నా జీవితమే నువ్వు అనుకోవడం తప్పు నాదే నా ప్రేమను నీపై పెంచుకోవడం తప్పు నాదే నా ప్రపంచమే నువ్వు అనుకోవడం తప్పు నాదే నిన్నుమరువలేకపోవడం - ప్రియ
నీ గురించి ఆలోచించిన మొదటి క్షణం నా గురించి అలోచించుకున్న ఆకరి క్షణం
ప్రకృతిలోని పసి పాపని , కదిలే కాలానికి సాక్షాన్ని, అంతులేని అవరోదాలకి తోలి అడుగుని, గమ్యం లేని ప్రయాణానికి ఆకరి మజిలిని
ఈనాటి నీ చెరగని చిరునవ్వుల చిరునామా నేనే! రేపటి నీ గుండెల ఆరని మంటల వెలుగుని నేనే ! నీలో కలిగే ప్రతి ఆశ , అలజడి ప్రతిరూపాన్ని నేనే !
నీపై నా ప్రేమ ని తెలియజేయమని నన్ను తొందర చేసేది నా మనసా లేక ఆందులో ఉన్న నువ్వా ??