గెలుపు కోసం

గెలుపు కోసం

 


పరిస్థితులు పగబట్టనీ..
పక్కవాళ్ళు ఛీ కొట్టనీ..
అయినవాళ్ళు అవమానించనీ..
ఎవరో ఏదో అన్నారని.. నువ్వు అనుకున్నదేది జరగట్లేదని.. ఏడుస్తూ కూర్చుంటే ఎలా?..
"ఈరోజు చీకటిని చూసి క్రుంగిపోకు..
రేపటి వెలుగు కోసం పరుగు మొదలుపెట్టు"..
నువ్వు కింద పడనీ.. నీ మీద నింద పడనీ.. నువ్వు మాత్రం పరుగు ఆపకు..
గెలుపు కోసం పరుగెత్తు..
గెలవడానికి పరుగెత్తు..
గెలిచి నువ్వేంటో చూపించు..
నిన్ను చులకనగా చూసినకళ్ళే.. నీ గెలుపుని చూసి కుళ్ళుకోవాలి.