విరబూసిన పువ్వులం
posted on Apr 19, 2021
విరబూసిన పువ్వులం
విరబూసిన పువ్వులం చిరునవ్వుల బాలలం
లోగిలో తిరిగాడు చిన్ని చందమామలం
విరబూసిన పువ్వులం చిరునవ్వుల బాలలం
చల్లనైన వెన్నెలను ముంగిట్లో కురిపిస్తాం
ముద్దుముద్దు మాటలతో ఆనందం పంచుతాం
"విరబూసిన"
చిట్టి పలక చంక నెట్టి ప్రతిరోజూ బడికెళతాం
టీచరమ్మ నేర్పే ఆట కలసిమెలసి ఆడతాం
"విరబూసిన"
మేము భావిపౌరులం వెలుగునిచ్చే దివ్వెలం
ఇంటింటా కోరుకొనే చిరు నవ్వుల పాపలం
"విరబూసిన"
- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో