చైత్ర కుసుమాంజలి
posted on Apr 27, 2018
చైత్ర కుసుమాంజలి
వసంత ఋతువు తో కొత్త చిగురు
కొత్త చిగురుతో కోయిలమ్మ పాట
కోయిలమ్మ పాట తో క్రొత్త సంవత్సరం
క్రొత్త సంవత్సరం తో తెలుగోడి వెలుగు
తెలుగోడి వెలుగు తో చిత్త నక్షత్రం
చిత్త నక్షత్రం తో పౌర్ణమి మెరుపు
పౌర్ణమి మెరుపు తో నులివెచ్చని సొగసు
నులివెచ్చని సొగసుతో ప్రకృతి పరవశం
ప్రకృతి పరవశం తో కుసుమాల మకరందం
కుసుమాల మకరందం తో పులకరించే పుడమి
పులకరించే పుడమి తో వ్యాపించే అమృత వర్షిణి
అమృతవర్షిణి కి ఇదే చైత్ర కుసుమాంజలి
రచన: నాగమణి పగడాల