మా'నవ'త్వం
posted on Jul 28, 2020
మా'నవ'త్వం
సమాజమనే చీకటి గుహలో
తిరుగాడుతున్న
డార్విన్ సిద్ధాంతంలోని
వానరులెప్పుడు మానవులయ్యారని?
మానవత్వానికి సరైన అర్ధాన్ని
మతమనే కాగడాతో
వెతికితే తగలడే
తలల వెలుగుల్లో
నే చూడాలొకసారి!
నవీన లోకాన
అదృశ్య శక్తిగా మారిన
నేటి బూతుపదం "మానవత్వం"
ఎక్కడ నక్కి ఎక్కిళ్లు పెడుతూ
ఏడుస్తుందో..
చూడాలో 'కసాయి'
చూడాలొకసారి
చేరాలొక 'సారీ'..!!
- రఘు ఆళ్ల