ఒక నవ్వుతో

ఒక నవ్వుతో

 

 

సంద్రం దాచిన ముత్యపు చిత్రాన్ని
లేగదూడ పెదానికంటిన వెచ్చటి పాల నురగతో
తెలుగమ్మ కమ్మటి చూపుల కుంచెతో
అమ్మ కొంగంటి కాన్వాసుపై గీస్తే

తొలకరి జల్లులో మెరిసిన మెరుపులో
చెట్టు దాచుకున్న చిగుర్ల పచ్చదనమవ్వదా?
చలివేళ కాచుకున్న నాన్న గుండెపై
వెచ్చదనమవ్వదాఆ నవ్వు

ఎన్ని అర్ధాలో ఓ (నీ) నవ్వులో
ఎన్ని అద్దాలో ఆ పువ్వులో!!

 

-రఘు ఆళ్ల