ప్రకృతి చిన్నబోయింది

అతడు పేరుతగ్గట్లు సుందరుడే
సమాజమెపుడు సవ్యంగా నడవాలనే ఆశయం 
అందరూ సమానమనే వాదం ఆయన నినాదం
ఎదనింపుకుని సాధించేందుకు ఉధ్యమానికైనా వెనకాడని నైజం ఆయన సొంతం
మనిషి ఉన్నతికోసం ఆహర్నిషలు ఆరాటం
అదే ఆయన పోరాటం
దేశ దాస్యశృంఖాలాలను చేదించడంకోసం 
అహింసమార్గంలో ఎదిరించిన
గాంధేయవాది
ఆయన దేశంకోసమే కాదు
మనుషులకోసమేకాదు
దేశంలో ఉండే ప్రతీది సస్యశ్యామలంగా ఉండాలనే 
దృడసంకల్పం 
చెట్లుచేమలు పచ్చగ అలరారుతూ 
నోరులేని మూగజీవాలను సైతం ప్రేమించిన సాధుజీవి
బహుజనులపక్షం నిలిచి
సమాసమాజానికై పాటుపడిన
సుందర్ లాల్ బహుగుణ
ప్రేమించిన ప్రకృతిని పాడుచేసే
వికృతకారుల దాడిని ఆపినవాడాయన
అవనిలోని అందానికి సహజత్వాన్నద్దిన మేధావి
అడవులైన నదులైన మనిషికి
అవసరాలకు ఉపయోగపడేలా ప్రతినభూనిన మహోన్నత వ్యక్తిత్వం
చిప్కో ఉద్యమంతో వనరుల సంరక్షణ చేపట్టి
మానవాళి మనుగడకు 
తోడ్పాటునందించిన ప్రకృతి పక్షపాతి
కాలంవేసిన కాటుకు బలైన
బహుగుణ సంపన్నుడు
శాశ్వతం ఆయన భవిష్యత్ భారతం
(సుందర్ లాల్ బహుగుణ మరణించిన సంధర్భంగా స్మరిస్తూ)

 

సి. శేఖర్(సియస్సార్)