ఉగాది పద్యకవిత

ఉగాది పద్యకవిత

 

 

 

చైత్రమిది పాఢ్యమిది ప్రతీయుగానికి ఆద్యమిది
పుణ్యమిది ధన్యమిది పుడమి పుట్టిన రోజు యిది
భాష్యమిది తేజమిది తెలుగుజాతికే పునీతమిది
వర్ణమిది కర్ణమిది మన సంస్కృతికే ఆభరణమిది
వెలుగుఇది జిలుగుఇది అంధకార విమోచనమిది
ఆరంభమిది ఆనందమిది ఆరు రుచుల అన్వేషనిది
ప్రారంభమిది  ప్రారబ్ధమిది ప్రకృతికే ప్రణమిల్లు రోజు ఇది 
తీరు యిది దారి యిది జీవన సరళికి ఆది యిది
తొలిఅడుగు యిది తొలిపలుకు యిది నాగరికతకే నాంది  యిది
నవ్యమిది భవ్యమిది నరనరాల నాభావమిది  

రచన: నాగేంద్ర