నేటి కవిత్వం

 

నేటి కవిత్వం

 

కవిత్వం
కాలానుగుణంగా
తనరూపం మార్చుకుంటుంది
ప్రాచీనం నుండి ఆధునికందాకా

కవిత్వం రెండంచులుగల ఖడ్గమే
ప్రశంసలతో ముంచెత్తగలదు
విమర్శతో విల్లెక్కుపెట్టగలదు

నేటితరం సైతం
పోతనలా హలంపట్టి
కవిత్వాన్ని నిలబెట్టగలరు

కవిసార్వభౌముడిలా
కనకాభిషేకాలతో
తులతూగనూగలరు

యథారాజా తథాప్రజా
పాలకపక్షం
ప్రతిపక్షం
కవిపక్షమేదో
అదే ఆయన కవిత్వం

నేడొస్తున్నది
గుండెలోతుల్లో దాచుకున్న
అగ్నిపర్వతంలాంటిది
ఉప్పొంగిన లావాలా 
సమాజాన్ని కడిగేది

కవిత్వమొక సముద్రం
ఎవడి గుండెఘోషలు
రేగే అలజడులకు
వెరవక
స్వేచ్ఛగా వాడినిపిస్తడు

స్వార్థంతో రాసే కవిత్వం
నిలవదిక్కడ
సారం నిండినదే
జీవంపోసుకుని
అందరి గుండెల్లో
సజీవమై నిలబడతది

కవిత్వం
నిజాయితీ నిండినదై
నిఖార్సైనదయినపుడే
చిగురువేస్తూ
చైతన్యదీప్తులు నింపేదయ్
నవసమాజ నిర్మాణానికై
కవికలం పాటుపడాలీ..

సి. శేఖర్(సియస్సార్)