మన సమాజంలో..

మన సమాజంలో..

 


మన సమాజంలో
సత్యానికి సత్తువ లేదు
న్యాయానికి నాణ్యత లేదు
ధర్మానికి దారి లేదు
శాంతికి శ్రమ లేదు

అసత్యానికి అడ్డు లేదు
అన్యాయానికి అదుపు లేదు
అధర్మానికి అలుపు లేదు
అశాంతికి విశ్రాంతి లేదు

నిజాన్ని నిద్రపుచ్చి
అబద్ధం మేల్కొంది

అన్యాయం అంటే అభివృద్ధి ఉండదు
అన్యాయం ఉంటే అభివృద్ధే ఉండదు


 

రచన : వెంకు సనాతని