ఏది ఇక్కడ శాశ్వతం
posted on Jun 14, 2021
ఏది ఇక్కడ శాశ్వతం
అమ్మ గర్భంలో
ప్రాణం పోసుకున్నాను
నాన్న గుండెపై
నడక నేర్చుకున్నాను
అక్క చంకనెక్కి గుడికెళ్ళాను
అన్న వేలుపట్టి బడికెళ్ళాను
తమ్ముడికి లోకాన్ని చూపాను
చెల్లెలికి శోకాన్ని మాపాను
నిన్న మొన్నటి వరకు
అందరితో కలిసున్న నేను
నేడు ఒంటరినై పోయాను
తల్లిదండ్రులతో తగువులు
అన్నదమ్ములతో తెగువలు
ఆడబిడ్డలతో గొడవలు
ఆస్తుల కోసం ఆరాటం
అస్తమానం పోరాటం
రాగద్వేషాలకు అంకితమైన
రోగదోషాల జీవితమా
ఏది ఇక్కడ శాశ్వతం
రచన : వెంకు సనాతని