posted on Jul 15, 2019
చెలి మూతి విరుపు
అలిగి పరుగులిడి
కురిసి మాయమయ్యే
మేఘాన్ని చూసి
ఆకశపు భావమేమంటే
నువ్వు అలా,
నా నవ్వులా
రేయికి కాస్త విరిసే కలలా
అని నీకు చెప్తే
మళ్లీ నింగిన మెరిసి మాయమయ్యే
ఓ తుంటరి మెరుపులా
ఉంటది..
నీ మూతి విరుపు,
నిజమైన నా భావావేశపు మెరుపు!!!
- Raghu Alla