కైపు
posted on Feb 10, 2020
posted on Feb 10, 2020
కైపు
కావ్యపానము జేసి
కై పెక్కినానే!
దివ్యలోకాలన్ని
తిరిగొచ్చినానె!
ఎక్కరానీకొండ
లెక్కివచ్చానే!
పైకెక్కి నీకేసి
పారజూశానే!
కావ్యపానము జేసి
కై పెక్కినానే!
కావ్యదేవత నోటె
కవిత విన్నానె
చీమ లనిపించారె
భూమిలో కవులు!
కావ్యపానము జేసి
కైపెక్కినానే!
(బసవరాజు అప్పారావు 1894 - 1933)