ధైర్యమే ఆయుధం
posted on May 11, 2021
ఓ విషక్రిమి
మకుటపు ఆకారంలో
దేశపు ప్రాకారాలను దాటి
దేహంపై దండయాత్ర చేస్తుంది
కంటికి కనిపించని ఈ శత్రువు
కంఠము దాటి గంటలలోపే ఊపిరి
ఇంటిని ఈ లోకం నుండి గెంటేస్తుంది
శివాలెత్తే సూక్ష్మి సవాలుకు
సతికలపడుతున్నాయి శవాలు
సంశయంలో నరుని ఆనవాళ్ళు
బొంది మీద చిందులేస్తూ
మందిని పీడిస్తున్న మహమ్మారికి
స్వీయ నిర్బంధమే సరైన మందు
చేయి చేయి కలపకుండా
చేతులు జోడించడమే అండాదండా
కాలు గడప దాటకుండా
కుదురుగ ఇంట్లో ఉండటమే అజెండా
దేహ శుభ్రతను పాటిస్తే
దేశ భద్రతలో భాగమైనట్టే
సమైక్యతా ధైర్యమే ఆయుధం
సామాజిక దూరమే ఔషధం
రచన : వెంకు సనాతని