గొంతెమ్మ కోరిక
posted on Dec 4, 2023
ముద్దొస్తున్న బుజ్జిముండ మేకపిల్ల
పెద్దయ్యాక ననీ పంటి కింద మాంసం ముక్క
కులం తక్కువ దరిద్రం పెద్దపిల్ల
పెద్దయ్యాక నీ పక్క మీద మల్లె పువ్వు
నువ్వు పెంచుకున్న కుక్క పిల్ల
నీకు చిన్నప్పుడూ, పెద్దప్పుడూ కూడా బానిసే
చిన్నప్పట్నించి పెద్దప్పుడు దాకా
నీకు ఒక్కటే కోరిక
ఈ లోకమంతా నీకు కుక్కపిల్లలూ
మేకపిల్లలూ, మల్లెపువ్వులూ కావాలని
-పెమ్మరాజు గోపాలకృష్ణ