మిగిలిపోయిన కథలు
posted on Jan 6, 2021
మిగిలిపోయిన కథలు
మనసు పలకలేని రాగాలు అన్నీ
పలకల మీద బలపాల్లా కరిగిపోతున్నాయి
రాళ్ళు చూపలేని కళలు అన్నీ
శిల్పాల మీద రంగుల్లా మిగిలిపోతున్నాయి
కథలు అన్నీ మిగిలిపోయినవే
కొన్ని పాతవి...
మరి కొన్ని కొత్తవి...
వాటి స్వరూపమే మారింది
మిగిలిపోయే తత్వమైతే అలానే ఉంది
చడీచప్పుడు లేని మామూలు జీవితం
గడపాలనుకునేవారు కోట్లలో ఉంటారు
కానీ సమాజం చేత ఏమీ చేయకుండా
చేతకానివాళ్లలా మిగిలిపోయిన మనుషులెందరో
మిగిలిపోయిన కథలెన్నో
ఒకరి కథ నిద్రపుచ్చితే...
మరో కథ నిద్రలో కూడా మనల్ని నిద్రపోనివ్వదు...
-Malleshailu