తేల్చుకో....ఓటరన్న
posted on Dec 2, 2020
తేల్చుకో....ఓటరన్న
వచ్చెచ్చె రానేవచ్చే
నీకంటూ ఓరోజు
అది ఈరోజు
నిన్ను నీవు తెలుసుకుని
మసలుకునే రోజు
రానేవచ్చే
అధికారం అందుకుంటావో
సోమరివై దారపోస్తవో
పచ్చని నోట్లకమ్ముడుపోయి
బతుకుల చిచ్చుదెచ్చుకుంటవో
మందుసీసలకు బానిసై మత్తులోదిగి
జిందగీలున్న వెలుగునంత చీకటిజేసుకుంటవో
వాగ్ధానాలకు ఉబ్బితబ్బిబ్బై
ఊతమిచ్చి(ఓటు)
ఉపాసముంటవో
జరంత ఆలోచనజేయ్
తర్వాతనే ఓటేయ్
నాయకుడికుండే సేవ దృక్పధం చూడు
లొంగావో ఐదేళ్ళ నరకం ఇక్కడే చూస్తవ్
ఇప్పుడు నీవో ఫైటర్
ఆలోచనల్లో ఉండాలి మెచ్యూర్
ఓటరన్న నీకుండాలి ఫ్యూచర్
లేదంటే నీకెపుడు డేంజర్
సి. శేఖర్