మన ఆనందం ప్రకృతి

ప్రతి మనిషి ఆహ్లదంగా 
జీవనం సాగించాలని
ప్రతినిమిషం ఆరాటం
ప్రకృతి అమ్మ ఒడిలా లాలిస్తుంది
పుడమినంత పచ్చదనంతో పులకరింపజేస్తుంది
ఎన్నో జీవరాసులకు సంరక్షణ
ప్రకృతి రక్షణ మనందరి బాద్యత
ఆకాశంలో హరివిల్లులా అవని ఎదపై విరియాలి నందనవనాలెన్నో!
ప్రకృతి మనందరవసరాలను కాలానుగుణంగా తీరుస్తుంది
కానీ..మనిషి స్వార్థం
ప్రకృతికి శాపమయ్యింది
తరువులను నరికి జగతినంతా నరకంగా మారుస్తున్నాం
ప్లాస్టిక్ భూతానికి భూతల్లి శక్తిని కోల్పోతుంది
వ్యర్థాలన్ని నదుల్లో కలిసి తాగే నీరు కాలుష్యం
సహజత్వం లేని కృత్రిమత్వం
ప్రకృతిని కాపాడలేని మనిషి
తన వినాశనాన్ని తానే తెచ్చుకుంటున్నడు
కావునా 
కళ్ళు తెరవాలందరం 
ప్రకృతిని కాపాడగ అడుగేయాగ

 

కె. ఉదయ్ కుమార్