కరోనా జర టైరోనా
posted on Sep 21, 2020
కరోనా జర టైరోనా
ఏమది అంతలా దండెత్తావు మాపై
పై ప్రాణాలు పైనే తోడేస్తుంటివి
కరోనా కాస్త కరుణ చూపు
ఎందరెందరో బతుకుదెరువు లేక ఆకలికేకలను అర్థం చేసుకో..
కట్టడి చేస్తున్నాం
కానీ వల్ల కావట్లేదు
చిన్నతప్పు పెద్దముప్పై కూర్చుంటుంది
శుచీ శుభ్రతలెన్నో
శానిటైజరెపుడు పూసుకున్నా
వస్తోంది
కారణం
సామాజిక దూరం పాటించడం లేదు మనిషి
అంటిస్తూ ఆనందంలో తేలిపోతున్నరు మూర్ఖులు
ప్రభుత్వాలెపుడో చేతులెత్తేసాయ్
జీవనగమనాన్ని సాగించే
మనిషి మనుగడ గడవడం
చాలా కష్టమైంది
సి. శేఖర్(సియస్సార్)